తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా గుత్తా
Sakshi Education
తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ మేరకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్.. నూతన చైర్మన్‌గా గుత్తా ఎన్నికైనట్లు సెప్టెంబర్ 11న ప్రకటించారు. అనంతరం మండలి చైర్మన్‌గా గుత్తా బాధ్యతలు స్వీకరించారు. శాసన మండలిలో జరిగే చర్చల్లో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా సభ్యులు పనిచేయాలని ఈ సందర్భంగా గుత్తా సూచించారు.
గుత్తా సుఖేందర్‌రెడ్డి కెరీర్
జననం: 1954, ఫిబ్రవరి 02
జన్మస్థలం: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల
విద్యార్హత: బీఎస్సీ
పొలిటికల్ కెరీర్: ఉరుమడ్ల గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు (1981).
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : గుత్తా సుఖేందర్‌రెడ్డి
గుత్తా సుఖేందర్‌రెడ్డి కెరీర్
జననం: 1954, ఫిబ్రవరి 02
జన్మస్థలం: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల
విద్యార్హత: బీఎస్సీ
పొలిటికల్ కెరీర్: ఉరుమడ్ల గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు (1981).
- చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ (1984).
- చిట్యాల సింగిల్ విండో చైర్మన్ (1991).
- నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార యూనియన్ చైర్మన్ (1992-99).
- నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు ఆఫ్ ఇండియా డెరైక్టర్ (1998).
- నల్లగొండ లోక్‌సభ సభ్యులు (13, 15, 16 లోక్‌సభలో).
- తెలంగాణ రైతు సమన్వయ సమితి చైర్మన్ (2018-19).
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : గుత్తా సుఖేందర్‌రెడ్డి
Published date : 12 Sep 2019 04:00PM