తెలంగాణ రెండో స్పీకర్‌గా పోచారం ఎన్నిక
Sakshi Education
తెలంగాణ రెండో శాసనసభ స్పీకర్‌గా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి జనవరి 18న బాధ్యతలు చేపట్టారు.
స్పీకర్ పదవికి శ్రీనివాస్‌రెడ్డి ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. జనవరి 18 ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశమైంది. తాత్కాలిక స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ వెంటనే తొలిరోజు ప్రమాణం చేయని ఎమ్మెల్యేలతో ఈ కార్యక్రమం కొనసాగించారు. అనంతరం స్పీకర్ ఎన్నికను ప్రకటించారు. ‘తెలంగాణ శాసనసభ స్పీకర్ పదవికి నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖానాయక్ (టీఆర్‌ఎస్), వి.ఎం.అబ్రహం (టీఆర్‌ఎస్), తలసాని శ్రీనివాస్ యాదవ్ (టీఆర్ ఎస్), అహ్మద్ బిన్ అబ్దుల్ బలాల(ఎంఐఎం), మల్లు భట్టివిక్రమార్క (కాంగ్రెస్) స్పీకర్ పదవికి శ్రీనివాస్‌రెడ్డిని ప్రతిపాదించారు. ఒకే నామినేషన్ దాఖలు కావడంతో శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికయ్యారు’ అని ప్రకటించారు. స్పీకర్‌గా శ్రీనివాస్‌రెడ్డిని బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరారు. సభానాయకుడు, ఇతర పార్టీల నేతలు కలసి ఈ ప్రక్రియ కొనసాగించాలని సూచించారు.
న్యాయబద్ధంగా వ్యవహరిస్తా: స్పీకర్ పోచారం
తెలంగాణ రెండో శాసనసభకు స్పీకర్‌గా తనను ఎన్నుకున్నందుకు శాసనసభ్యులకు పోచారం శ్రీనివాస్‌రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘శాసనసభాపతి పదవి అత్యంత కీలకం. సభ నిర్వహణలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విధుల నిర్వహణలో సభాపతిగా న్యాయబద్ధంగా వ్యవహరిస్తా. సభ్యులందరి సహకారంతో సభా కార్యక్రమాలను ఆదర్శవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తా. అసెంబ్లీని ప్రజాసమస్యలు చర్చించే వేదికగా నడుపుకోవడం మనందరి బాధ్యత. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, సభకు అంతరాయం కలిగించడం గౌరవప్రదం కాదు. ప్రజల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా సభ నిర్వహించుకుందాం. ప్రజలకు న్యాయం చేసే క్రమంలో మీరంతా (ఎమ్మెల్యేలు) సహకరిస్తారని ఆశిస్తున్నా. అందరం కలసి సభను ఆదర్శ శాసనసభగా తీర్చిదిద్దుదాం. శాసనసభ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా సభ్యులందరూ వ్యవహరిస్తారని ఆశిస్తున్నా. వ్యవసాయ మంత్రిగా రాష్ట్ర రైతాంగానికి సేవ చేసే అవకాశం కల్పించడమే కాకుండా లక్ష్మీపుత్రుడిగా బిరుదు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు’ అని పోచారం పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: తెలంగాణ రెండో శాసనసభ ఎన్నిక
ఎప్పుడు: జనవరి 18
ఎవరు: పోచారం శ్రీనివాస్‌రెడ్డి
ఎక్కడ: తెలంగాణ

Published date : 19 Jan 2019 07:40PM