తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తి
Sakshi Education
తెలంగాణ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ గండికోట శ్రీదేవి నవంబర్ 19 ప్రమాణం చేశారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఆమెతో ప్రమాణం చేయించారు. అలహాబాద్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ శ్రీదేవిని రెండేళ్ల కిందట తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. అయితే జస్టిస్ శ్రీదేవిని పూర్తిస్థాయి జడ్జిగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన జస్టిస్ శ్రీదేవి ఆలిండియా కోటాలో 2005లో ఉత్తరప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. 2016లో జిల్లా, సెషన్స్ జడ్జిగా పదోన్నతి పొందారు. అలాగే వివిధ హోదాల్లో పనిచేశారు. ఘజియాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగాప్రమాణం
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : జస్టిస్ గండికోట శ్రీదేవి

Published date : 20 Nov 2020 06:07PM