తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ చౌహాన్ ప్రమాణం
Sakshi Education
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేశారు.
రాజ్‌భవన్‌లోని దర్బార్‌హాల్‌లో జూన్ 22న గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ కలకత్తా హైకోర్టుకు బదిలీ కావడంతో, 2019, మార్చి 28 నుంచి సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ జూన్ 19న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం
ఎప్పుడు : జూన్ 22
ఎవరు : జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్
ఎక్కడ : దర్బార్‌హాల్, రాజ్‌భవన్, హైదరాబాద్

Published date : 24 Jun 2019 06:24PM