Skip to main content

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్‌ను కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ కేంద్ర న్యాయ శాఖ మార్చి 23న ఉత్తర్వులు జారీ చేసింది.
2019, ఏప్రిల్ 6లోపు కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించాలని న్యాయశాఖ పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి సిఫార్సు మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీకి ఆమోద ముద్ర వేశారు. 2018, జూలై 7న తె లుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ నియమితుల య్యారు. తర్వాత ఉమ్మడి హైకోర్టును విభజించడంతో 2019, జనవరి 1 నుంచి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోల్ కతా హైకోర్టుకు బదిలీ
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్
Published date : 25 Mar 2019 05:38PM

Photo Stories