Skip to main content

తెలంగాణ ఏసీజేగా జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్చి 27న ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటివరకు హైకోర్టు పధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్‌ను కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టులో నంబర్ 2 స్థానంలో ఉన్న జస్టిస్ చౌహాన్ ఏసీజేగా నియమితులయ్యారు.

1959 డిసెంబర్ 24న రాజస్తాన్‌లో జన్మించిన జస్టిస్ చౌహాన్ 1980లో అమెరికాలోని ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 2005లో రాజస్తాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2015లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2018, నవంబర్ 21న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చౌహాన్ బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) నియామకం
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్
Published date : 28 Mar 2019 05:29PM

Photo Stories