తెలంగాణ దళిత బంధు పథకం ఎక్కడ ప్రారంభమైంది?
Sakshi Education
దళితుల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తెలంగాణ దళిత బంధు’ పథకం ప్రారంభమైంది.
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగస్టు 4న ఈ పథకాన్ని ప్రకటించారు. వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.7.60 కోట్లు విడుదల చేస్తున్నట్టు సీఎం తెలిపారు. వాసాలమర్రి దళితులందరికీ భూమి ఇస్తామని, ఇండ్లు కట్టిస్తామని ప్రకటించారు.
పథకం ఉద్దేశం...
కుటుంబం యూనిట్‌గా అర్హులైన దళిత కుటుంబాలకు నేరుగా ఆర్థికసాయం చేసి, వారికి ఇష్టమైన పనిని ఎంచుకుని, అభివృద్ధి చెందే అవకాశాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దళారుల బాధలేకుండా.. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని జమ చేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ దళిత బంధు పథకం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
ఎక్కడ : వాసాలమర్రి, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా
ఎందుకు : రాష్ట్రంలోని దళితుల సాధికారత కోసం...

Published date : 05 Aug 2021 06:02PM