తైవాన్ సైన్యాధ్యక్షుడు షెన్ యి దుర్మరణం
Sakshi Education
తైవాన్‌లో జరిగిన సైనిక హెలికాప్టర్ ప్రమాదం కారణంగా తైవాన్ సైన్యాధ్యక్షుడు షెన్ యి-మింగ్(62)తో సహా మరో ఎనిమిది మంది సైనికాధికారులు దుర్మరణం పాలయ్యారు.
మరో ఐదు మంది గాయాల పాలయ్యారు. తైవాన్‌కు ఈశాన్య ప్రాంతంలోని సైనికులను స్వయంగా కలసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు జనవరి 1న సైన్యాధ్యక్షుడితో పాటు మరో 12 మంది అధికారులు హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. ఈ క్రమంలో రాజధాని తైపీకి సమీపంలోని కొండల్లో హెలికాఫ్టర్ అదృశ్యమైంది. దీంతో గాలింపు చర్యలు చేపట్టగా హెలికాఫ్టర్ కూలిన ప్రదేశాన్ని జనవరి 2న గుర్తించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయాలతో బయటడినట్లు ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెవాన్ సైన్యాధ్యక్షుడు మృతి
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : షెన్ యి-మింగ్(62)
ఎక్కడ : తైపీకి సమీపంలో, తైవాన్
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెవాన్ సైన్యాధ్యక్షుడు మృతి
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : షెన్ యి-మింగ్(62)
ఎక్కడ : తైపీకి సమీపంలో, తైవాన్
మాదిరి ప్రశ్నలు
1. క్రింది వాటిలో అల్బేనియా రాజధాని, కరెన్సీ(వరుసగా)ని గుర్తించండి.
1. తిరానె, లెక్
2. లుయాండా, యూరో
3. లుయాండా, లెక్
4. తిరానె, యూరో
- View Answer
- సమాధానం : 1
2. ప్రపంచ మహిళా దినోత్సవంను ఎప్పుడు నిర్వహిస్తారు?
1. మార్చి 28
2. మార్చి 18
3. ఏప్రిల్ 28
4. మార్చి 8
- View Answer
- సమాధానం : 4
Published date : 04 Jan 2020 06:05PM