Skip to main content

టైమ్‌ 100 కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ సంస్థలు?

ప్రతిష్టాత్మక టైమ్‌ మ్యాగజైన్‌ తొలిసారిగా రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన 100 కంపెనీల జాబితాలో... దేశీ దిగ్గజాలు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో భాగమైన <strong>జియోప్లాట్‌ఫామ్స్</strong><strong>, </strong><strong>ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ సంస్థ బైజూస్‌</strong> చోటు దక్కించుకున్నాయి.
Current Affairs
భవిష్యత్‌కు రూపమిస్తున్న కంపెనీలకు తాజా జాబితాలో చోటు కల్పించినట్లు టైమ్‌ ఏప్రిల్ 28న తెలిపింది. జాబితా రూపకల్పన కోసం హెల్త్‌కేర్, వినోదం, రవాణా, టెక్నాలజీ సహా పలు రంగాల కంపెనీలను టైమ్‌ పరిశీలించింది. నవకల్పనలు, ప్రభావం చూపగలిగే సామర్థ్యం, లీడర్‌షిప్, ఆశయాలు, విజయాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది.

ఆవిష్కర్తల సరసన జియో..:నవకల్పనల ఆవిష్కర్తల కేటగిరీలో జియోప్లాట్‌ఫామ్స్‌ను టైమ్‌ చేర్చింది. జూమ్, అడిడాస్, టిక్‌టాక్, ఐకియా, మోడెర్నా, నెట్‌ఫ్లిక్స్‌ తదితర సంస్థలు ఈ విభాగంలో ఉన్నాయి.
డిస్రప్టర్స్‌ కేటగిరీలో బైజూస్..: వినూత్న ఆవిష్కరణలతో మార్కెట్‌ను కుదిపేసిన కంపెనీల కేటగిరీలో బైజూస్‌ చోటు దక్కించుకుంది. టెస్లా, హువావే, షాపిఫై, ఎయిర్‌బీఎన్‌బీ, డీడీ చషింగ్‌ తదితర సంస్థలు ఈ లిస్టులో ఉన్నాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి :అత్యంత ప్రభావవంతమైన 100 కంపెనీల జాబితాలోచోటు దక్కించుకున్న భారతీయ సంస్థలు?
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : టైమ్‌ మ్యాగజైన్‌
ఎక్కడ : ప్రపంచంలోనే
ఎందుకు :నవకల్పనలు, ప్రభావం చూపగలిగే సామర్థ్యం, లీడర్‌షిప్, ఆశయాలు, విజయాలు తదితర అంశాల ఆధారంగా...
Published date : 29 Apr 2021 06:04PM

Photo Stories