Skip to main content

టామ్‌ అండ్‌ జెర్రీ దర్శకుడు జీన్‌ డీచ్ క‌న్నుమూత‌

చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ దశాబ్దాలుగా అలరిస్తున్న కార్టూన్‌ సీరియల్‌ టామ్‌ అండ్‌ జెర్రీ దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత జీన్‌ డీచ్‌ మరణించారు.
Current Affairs
95 ఏళ్ల వయసున్న ఆయన చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని ప్రేగ్‌ నగరంలోని తన అపార్టుమెంట్‌లో ఏప్రిల్ 16న హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన పూర్తిపేరు యూజీన్‌ మెరిల్‌ డీచ్‌. టామ్‌ అండ్‌ జెర్రీ 13 ఎపిసోడ్లకు ఆయన దర్శకత్వం వహించారు. పొపెయి అనే సీరయల్‌ సైతం రూపొందించారు.
జీన్‌ డీజ్‌ మొదట ఉత్తర అమెరికా వైమానిక దశంలో పనిచేశారు. అనంతరం పైలెట్‌ ట్రైనింగ్‌ పూర్తిచేశారు. తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలతో సైన్యం నుంచి బయటకు వచ్చారు. 1959లో ప్రేగ్‌కు చేరుకున్నారు. చిత్రకళలో గట్టి పట్టున్న ఆయన కార్టూన్లు గీయడంపై దృష్టి పెట్టారు. డీచ్‌ దర్శకత్వం వహించిన మన్రో అనే చిత్రం 1960లో బెస్టు యానిమేటెడ్‌ షార్టుఫిలింగా ఆస్కార్‌ అవార్డు గెలుచుకుంది. జీన్‌ డీచ్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. వారంతా కార్టూనిస్టులే.

క్విక్ రివ్యూ :

ఏమిటి : టామ్‌ అండ్‌ జెర్రీ దర్శకుడు క‌న్నుమూత‌
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : జీన్‌ డీచ్‌(95)
ఎక్కడ : ప్రేగ్‌, చెక్‌ రిపబ్లిక్‌
Published date : 20 Apr 2020 06:32PM

Photo Stories