తాలిబన్లు స్వాధీనం చేసుకున్న నిమ్రోజ్ ప్రావిన్షియల్ రాజధాని?
Sakshi Education
అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా, యూరప్ దేశాల సేనలు వెనక్కి మళ్లడం మొదలైన తర్వాత తాలిబన్లకు అడ్డే లేకుండా పోయింది.
దేశంలో క్రమంగా ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తూ ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే 70 శాతం భూభాగం ముష్కరుల పెత్తనం కిందకు వచ్చేసింది. తాజాగా నిమ్రోజ్ ప్రావిన్షియల్ రాజధాని జెరాంజ్ నగరాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ గవర్నర్ రోహ్ గుల్ జైర్‌జాద్ ఆగస్టు 6న స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అఫ్గాన్ నుంచి విదేశీ సైనిక బలగాల ఉపసంహరణ మొదలైన తర్వాత తాలిబన్లు ఒక ప్రావిన్షియల్ రాజధానిని చెరపట్టడం ఇదే మొదటిసారి. ఇరాన్ సరిహద్దుల్లోని జెరాంజ్ నగరంలో 50 వేలకుపైగా జనాభా ఉన్నారు. మరోవైపు అఫ్గానిస్తాన్ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ మీడియా సెంటర్ డైరెక్టర్ దావాఖాన్ మెనపాల్‌ను తాలిబన్లు కాల్చి చంపారు.
Published date : 07 Aug 2021 05:38PM