స్వచ్ఛమైన భూమిని అందిద్దాం : కోవింద్
Sakshi Education
పచ్చని.. స్వచ్ఛమైన భూమిని భావితరాలకు అందించేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతగా మెలగాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు.
భారతీయ సంస్కృతి ప్రకృతితోనే ముడిపడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 5న దేశ ప్రజలకు ప్రధాని, రాష్ట్రపతి సందేశాన్నిచ్చారు. మరోవైపు పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ #SelfieWithSapling campaign ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి, దాంతోపాటు ఓ సెల్ఫీ దిగి పంపాలని మంత్రి పిలుపునిచ్చారు.
- ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం-2019 థీమ్: బీట్ ఎయిర్ పోల్యూషన్.
Published date : 06 Jun 2019 05:48PM