Skip to main content

స్వచ్ఛ భారత్‌ కోసం గ్రామాలకు ఎంత మొత్తాన్ని అందించనున్నారు?

స్వచ్ఛ భారత్‌(గ్రామీణ) పథకంలో భాగంగా తడి, పొడి వ్యర్థాల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా గ్రామాలకు రూ.40,700 కోట్లు అందనున్నాయి.
Current Affairs ఇందులో కేంద్రం రూ. 14 వేల కోట్లను, రాష్ట్రాలు రూ. 8,300 కోట్లను కేటాయిస్తాయని, 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా రూ. 12,730 కోట్లను, వివిధ ఇతర మార్గాల ద్వారా మిగతా మొత్తాన్ని సేకరిస్తామని కేంద్ర జలశక్తి శాఖ జూన్ 8న తెలిపింది. స్వచ్చభారత్‌ (గ్రామీణ) పథకం అమలును జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా జూన్ 8న సమీక్షించారు. ఈ పథకం ఫేజ్‌ 2లో భాగంగా 50 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లను, లక్ష కమ్యూనిటీ టాయిలెట్లను, 386 జిల్లాల్లో ‘గోబర్ధన్‌’ ప్రాజెక్టులను నిర్మిస్తామని జలశక్తి శాఖ తెలిపింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా గ్రామాల కోసం రూ.40,700 కోట్లు సేకరణ
ఎప్పుడు : జూన్ 8
ఎవరు : కేంద్ర జలశక్తి శాఖ
ఎందుకు : స్వచ్ఛ భారత్‌(గ్రామీణ) పథకంలో భాగంగా తడి, పొడి వ్యర్థాల నిర్వహణ కోసం..
Published date : 09 Jun 2021 07:36PM

Photo Stories