షూటింగ్‌లో మను భాకర్, అనీశ్‌లకు స్వర్ణాలు
Sakshi Education
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరుగుతున్న జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో యువ షూటర్ మను భాకర్ నాలుగు స్వర్ణాలు గెలుచుకుంది.
హరియాణాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 17 ఏళ్ల మను సీనియర్ టీమ్ విభాగం, జూనియర్ కేటగిరి వ్యక్తిగత విభాగం, జూనియర్ టీమ్ విభాగాల్లో స్వర్ణాలు సొంతం చేసుకుంది. డిసెంబర్ 24న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సీనియర్ ఈవెంట్ ఫైనల్లో మను 243 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. దివ్యాంశి ధామా (237.8), యశస్విని సింగ్ (217.7) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు.
మరోవైపు పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో హరియాణాకే చెందిన అనీశ్ భన్వాలా స్వర్ణం గెలుచుకున్నాడు. అనీశ్ 28 పాయింట్లు స్కోరు చేయగా... భవేశ్ షెఖావత్ (26), విజయవీర్ సిద్ధూ (22) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు స్వర్ణాలు
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : మను భాకర్
ఎక్కడ : భోపాల్, మధ్యప్రదేశ్

Published date : 25 Dec 2019 05:54PM