సూడాన్ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం
Sakshi Education
సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని సీలా సిరామిక్ పరిశ్రమలో డిసెంబర్ 3న భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
సిరామిక్ పరిశ్రమలోని ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాద ఘటనలో మొత్తం 23 మంది మృతి చెందగా, వారిలో 18 మంది భారతీయులు ఉన్నారు. 130 మందికి పైగా గాయపడ్డారు. ఆ పరిశ్రమలో మొత్తం 68 మంది భారతీయులు పనిచేస్తున్నట్లు ఢిల్లీలోని అధికారులకు డిసెంబర్ 4న సమాచారం అందించారు.
Published date : 05 Dec 2019 05:43PM