శ్రీలంకలో మరోసారి బాంబు పేలుళ్లు
Sakshi Education
ద్వీప దేశమైన శ్రీలంకలో మరోసారి బాంబు పేలుళ్లు సంభవించాయి.
నిఘావర్గాల సమాచారంతో సోదాలు జరుపుతున్న భద్రతాబలగాలపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు, అనంతరం తమనుతాము పేల్చేసుకున్నారు. ఏప్రిల్ 26న జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన తన అత్యవసర అధికారాలతో ఉగ్రసంస్థలు నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే), జమాతే మిల్లతూ ఇబ్రహీం(జేఎంఐ)లపై నిషేధం విధించారు. ఏప్రిల్ 21న ఈస్టర్ రోజు చర్చిలు, హోటళ్లలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో 253 మంది చనిపోవడం తెల్సిందే.
Published date : 29 Apr 2019 05:24PM