శ్రీలంకలో జాతీయ అత్యవసర పరిస్థితి
Sakshi Education
వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన శ్రీలంకలో ఏప్రిల్ 22 అర్ధరాత్రి నుంచి జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లోకి వచ్చింది.
కేవలం ఉగ్రమూకలను ఏరివేసేందుకే ఈ అత్యవసర పరిస్థితిని విధించామనీ, ప్రజల భావప్రకటన స్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. మూడు చర్చిలు, మూడు ఐదు నక్షత్రాల హోటళ్లపై ఏప్రిల్ 21న జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 215 మంది చనిపోగా, చికిత్స పొందుతూ మరో 75 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో 500 మందికిపైగా ప్రజలు చికిత్స పొందుతున్నారు.
మరో బాంబు పేలుడు
కొలంబోలోని సెయింట్ ఆంథోనీ చర్చిలో ఏప్రిల్ 22న మరో బాంబు పేలుడు సంభవించింది. ఉగ్రవాదులు ఓ వాహనంలో బాంబును అమర్చారని అధికారులు తెలిపారు. దీన్ని నిర్వీర్యం చేస్తుండగా బాంబు ఒక్కసారిగా పేలిందన్నారు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీలంకలో జాతీయ అత్యవసర పరిస్థితి
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : శ్రీలంక ప్రభుత్వం
ఎందుకు : ఉగ్రమూకలను ఏరివేసేందుకు

Published date : 23 Apr 2019 06:10PM