Skip to main content

శ్రీకాంత్, అంజుమ్‌కు సీకే నాయుడు పురస్కారం

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతి యేటా ఇచ్చే ప్రతిష్టాత్మక సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుకు 2019 ఏడాదికి గానూ భారత దిగ్గజ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్, భారత మహిళల జట్టు మాజీ సారథి అంజుమ్ చోప్రాలు ఎంపికయ్యారు.
Current Affairsఈ విషయాన్ని ఈ మేరకు బీసీసీఐ డిసెంబర్ 27న ప్రకటించింది. వీరిద్దరూ క్రికెట్‌కు చేసిన సేవలకు గానూ వారిని సీకే నాయుడు అవార్డుతో సత్కరిస్తున్నామని తెలిపింది. ఈ అవార్డును 2020, జనవరి 12న ముంబైలో జరిగే బీసీసీఐ బోర్డు వార్షిక అవార్డుల కార్యక్రమంలో అందజేయనున్నారు.

చెన్నైకు చెందిన 60 ఏళ్ల శ్రీకాంత్... భారత్‌కు 1981-1992 మధ్య ప్రాతినిధ్యం వహించాడు. 43 టెస్టుల్లో 2062 పరుగులు, 146 వన్డేల్లో 4091 పరుగులు చేశాడు. భారత్ 1983లో తొలిసారి ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. అలాగే అతను చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలోనే భారత్ 2011లో రెండోసారి ప్రపంచ కప్‌ను గెలిచింది. 1989లో ఇతని సారథ్యంలోనే సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇక 42 ఏళ్ల అంజుమ్ చోప్రా తన కెరీర్‌లో 12 టెస్టులు, 127 వన్డేలు, 18 టి20లు ఆడింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2019 సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : కృష్ణమాచారి శ్రీకాంత్, అంజుమ్ చోప్రా
ఎందుకు : క్రికెట్‌కు చేసిన సేవలకు గానూ
Published date : 28 Dec 2019 06:06PM

Photo Stories