Skip to main content

శ్రీ బాహుబలి అహింసా దిగ్విజయం కవితను ఎవరు రచించారు?

కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సాహితీవేత్త వీరప్ప మొయిలీకి సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది.
Current Affairs2020 సంవత్సరానికి గానూ సాహిత్య అకాడెమీ అవార్డులను వార్షిక ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ లెటర్స్‌’ సందర్భంగా మార్చి 12న ప్రకటించారు. మొయిలీ సహా 20 మందికి ఈ అవార్డును అందజేయనున్నారు. వీరప్ప మొయిలీకి ఆయన కన్నడ భాషలో రాసిన దీర్ఘ కవిత ‘శ్రీ బాహుబలి అహింసా దిగ్విజయం’కు, కవయిత్రి అరుంధతి సుబ్రమణియన్‌కు ఇంగ్లిష్‌లో ఆమె రాసిన కవితల సంకలనం ‘వెన్‌ గాడ్‌ ఈజ్‌ ఎ ట్రావెలర్‌’కు ఈ పురస్కారం లభించింది. ఏడు కవితా సంకలనాలు, నాలుగు నవలలు, ఐదు చిన్న కథలు, రెండు నాటకాలు, ఒక దీర్ఘ కవిత, ఒక మెమొయిర్‌కు సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. మలయాళం, నేపాలీ, ఒడియా, రాజస్తానీ భాషల్లోని సాహిత్యాలకు త్వరలో ఈ అవార్డులను ప్రకటిస్తామని అకాడెమీ వెల్లడించింది.

మొయిలీ, అరుంధతి కాకుండా నిఖిలేశ్వర్‌(తెలుగు), ఇమాయియం(తమిళం), అనామిక(హిందీ), ఆర్‌ఎస్‌ భాస్కర్‌(కొంకణి), హరీశ్‌ మీనాక్షి(గుజరాతీ), ఇరుంగ్బమ్‌ దేవన్‌(మణిపుర్‌), రూప్‌ చంద్‌ హన్స్‌దా(సంతాలి), నందకిషోర్‌(మరాఠీ), మహేశ్‌చంద్ర గౌతమ్‌(సంస్కృతం), హుస్సేన్‌ ఉల్‌ హక్‌(ఉర్దూ), అపూర్వ కుమార్‌సైకియా(అస్సామీ), దివంగత హిదయ్‌ కౌల్‌ భారతి(కశ్మీరీ), ధరనింధర్‌ ఓవరి(బోడో) తదితరులకు ఈ పురస్కారం లభించింది. పురస్కారం కింద రూ. లక్ష నగదు లభిస్తుంది. అవార్డుల ప్రదానోత్సవ తేదీని త్వరలో వెల్లడించనున్నారు.
Published date : 15 Mar 2021 06:08PM

Photo Stories