Skip to main content

సరిహద్దు వివాదంపై భారత్, చైనా చర్చలు

దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలను వేగవంతం చేయాలని భారత్, చైనాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.
Current Affairsత్వరగా ఈ సమస్యను పరిష్కరించుకుని పురోగతే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించాయి. సరిహద్దు వివాదంపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మధ్య 22వ దఫా చర్చలు ఢిల్లీలో డిసెంబర్ 21న జరిగాయి.

ఈ భేటీ విషయమై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ... ‘భారత్-చైనా వ్యూహాత్మక సంబంధాల కోణంలో సరిహద్దు సమస్యను చూడాలని, సరిహద్దుల్లో శాంతి నెలకొల్పాలని ఇరు వర్గాలు అంగీకారానికి వచ్చాయి. భారత్-చైనాల సంబంధాల్లో సుస్థిర, సమతులాభివృద్ధి ఈ ప్రాంతంతోపాటు ప్రపంచ శాంతి, అభివృద్ధికి సానుకూలంగా మారుతుందనే అభిప్రాయాన్ని ఈ ప్రత్యేక ప్రతినిధుల భేటీ వ్యక్తం చేసింది’అని తెలిపింది.

చైనాలో 23వ దఫా భేటీ
సరిహద్దు వివాదంపై చర్చించేందుకు వాంగ్, దోవల్‌ను రెండు దేశాలు ప్రత్యేక ప్రతినిధులుగా నియమించాయి. 2020 ఏడాది చైనాలో 23వ దఫా భేటీ కావాలని కూడా ఇద్దరు ప్రతినిధులు నిర్ణయించారు. భారత్-చైనాల మధ్య 3,488 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖపై వివాదం నలుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌తోపాటు టిబెట్ దక్షిణ ప్రాంతం కూడా తనదేనని చైనా వాదిస్తోంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సరిహద్దు వివాదంపై భారత్, చైనా చర్చలు
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : చెనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 23 Dec 2019 05:47PM

Photo Stories