Skip to main content

సంపన్న కుటుంబాల విరాళాలు మూడింతలు...ఎలా?

కరోనా మహమ్మారితో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ అత్యంత సంపన్న కుటుంబ (హెచ్ఎన్ఐ) విరాళాలు 2020 ఆర్థిక సంవత్సరంలో మూడింతలు పెరిగి.. రూ. 12,000 కోట్లకు చేరాయి.
Current Affairs2019 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే ప్రైవేట్‌ రంగం ఇచ్చిన విరాళాల్లో మూడింట రెండొంతుల వాటాకు చేరాయి. బెయిన్‌ అండ్‌ కంపెనీ, దస్రా సంస్థలు కలిపి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్‌ రంగ (విదేశీ, కార్పొరేట్, రిటైల్, అత్యంత సంపన్న వర్గాల (హెచ్‌ఎన్‌ఐ) కుటుంబాలు) విరాళాలు మొత్తం రూ. 64,000 కోట్లుగా ఉండగా.. ఇందులో కుటుంబాల వాటా దాదాపు 20 శాతంగా ఉంది. మొత్తం నిధుల్లో విదేశీ వనరుల నుంచి వచి్చనది 25 శాతంగా ఉండగా, దేశీ కంపెనీలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద కేటాయించినది 28 శాతంగాను, రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా మరో 28 శాతంగాను ఉంది. అయితే, దాతృత్వ కార్యక్రమాలకు ఇబ్బడి ముబ్బడిగా విరాళాలు వస్తున్నప్పటికీ సామాజిక సంక్షేమం మాత్రం కుంటినడకనే నడుస్తుండటం గమనార్హమని నివేదిక పేర్కొంది. ‘కుటుంబ దాతృత్వ కార్యకలాపాలు .. భారత అభివృద్ధి అజెండాను తీర్చిదిద్దేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. వీటికి మరింత ప్రోత్సాహం లభిస్తే దేశ శ్రేయస్సుకు తోడ్పడగలవు‘ అని తెలిపింది. విరాళాల్లో అత్యధిక భాగం వాటా విద్య, ఆరోగ్య రంగాలదే ఉంటోందని నివేదిక పేర్కొంది. విద్యా రంగానికి 47 శాతం, ఆరోగ్య రంగానికి 27 శాతం వాటా ఉందని వివరించింది.
Published date : 16 Mar 2021 05:29PM

Photo Stories