సంగీత విద్వాంసుడు పండిట్ జస్‌రాజ్ అస్తమయం
Sakshi Education
భారత సంగీత దిగ్గజాల్లో ఒకరైన ప్రముఖ సంగీత విద్వాంసుడు, గాయకుడు, పద్మవిభూషణ్ పండిట్ జస్ రాజ్ (90) ఇకలేరు.
అమెరికా న్యూజెర్సీలోని ఆయన నివాసంలో ఆగస్టు 17న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. పండిట్ జస్‌రాజ్ 1930 జనవరి 28న హర్యానాలోని హిసార్ జిల్లా పిలిమండోరిలో ఒక సంగీత కుటుంబంలో పుట్టారు. మేవతి ఘరానా శైలి గాయకుడైన జస్‌రాజ్ భిన్న రాగాలకు ప్రాణప్రతిష్ట చేస్తూ ఎనిమిది దశాబ్దాలపాటు శ్రోతలను మైమరపించారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడైన జస్‌రాజ్ ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మశ్రీ’ (1975), పద్మభూషణ్ (1990), పద్మవిభూషణ్ (2000) అవార్డులతో సత్కరించింది. సంగీత నాటక అకాడమీ అవార్డు (1987), సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (2010) సహా ఆయనకు అనేక పురస్కారాలు, బిరుదులు, సత్కారాలు లభించాయి.
చదవండి: సౌర గ్రహానికి పండిత్ జస్‌రాజ్ పేరు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ సంగీత విద్వాంసుడు, గాయకుడు,కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : పండిట్ జస్ రాజ్ (90)
ఎక్కడ : న్యూజెర్సీ, అమెరికా
ఎందుకు : గుండెపోటు కారణంగాచదవండి: సౌర గ్రహానికి పండిత్ జస్‌రాజ్ పేరు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ సంగీత విద్వాంసుడు, గాయకుడు,కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : పండిట్ జస్ రాజ్ (90)
ఎక్కడ : న్యూజెర్సీ, అమెరికా
Published date : 18 Aug 2020 04:45PM