Skip to main content

సముద్ర ప్రాంత భద్రతపై ఐరాస చర్చకు అధ్యక్షత వహించిన దేశం?

సముద్ర ప్రాంత భద్రతపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆగస్టు 9న చేపట్టిన ఉన్నత స్థాయి చర్చకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

‘సముద్రప్రాంత భద్రత పెంపు– అంతర్జాతీయ సహకారం’ అంశంపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ భేటీలో మండలి సభ్యదేశాలకు చెందిన పలువురు ప్రభుత్వాధినేతలు, దేశాధినేతలు, ఐరాసలోని సంబంధిత వివిధ విభాగాల బాధ్యులు పాల్గొన్నారు. ఐరాస భద్రతా మండలిలో జరిగే చర్చకు భారత ప్రధాని ఒకరు అధ్యక్షత వహించడం ఇదే తొలిసారి. భద్రతామండలికి 2021, ఆగస్టు నెలలో భారత్‌ సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

సముద్రప్రాంత సహకారానికి పంచ సూత్రాలు
సముద్ర ప్రాంత వివాదాలను పరిష్కరించుకునేందుకు ఐదు సూత్రాలతో కూడిన సముద్ర సమ్మిళిత రక్షణ వ్యూహాన్ని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. ఆ పంచ సూత్రాలివే..
1. ప్రపంచ ప్రగతి సముద్ర ప్రాంత వాణిజ్యం క్రియాశీలతపైనే ఆధారపడి ఉంది. చట్టపరమైన సముద్ర వాణిజ్యానికి అవరోధాలను తొలగించాలి.
2. సముద్ర జల వివాదాలను శాంతియుతంగా, అంతర్జాతీయ చట్టాల ప్రాతిపదికన పరిష్కరించుకోవాలి. ప్రపంచ శాంతి, సుస్థిరతలకు ఏకైక మార్గం ఇదే.
3. ప్రకృతి వైపరీత్యాలు, విద్రోహ శక్తుల కారణంగా తలెత్తే సవాళ్లను అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఈ విషయంలో ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించేందుకు భారత్‌ ఇప్పటికే ‘సెక్యూరిటీ అండ్‌ గ్రోత్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ ది రీజియన్‌ (సాగర్‌)’ వంటి కార్యక్రమాల ద్వారా అనేక చర్యలు చేపట్టింది.
4. సముద్ర పాంత పర్యావరణం, వనరులను కాపాడుకోవడం, జవాబుదారీతనంతో కూడిన సముద్ర ప్రాంత అనుసంధానితను ప్రోత్సహించడం.
5. సాగర జలాల్లో బాధ్యతాయుత అనుసంధానతను ప్రోత్సహించాలి.

క్విక్రివ్యూ :
ఏమిటి : వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేపట్టిన చర్చకు అధ్యక్షత వహించిన వ్యక్తి?
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎందుకు : సముద్రప్రాంత భద్రత పెంపు– అంతర్జాతీయ సహకారం అంశంపై చర్చలు జరిపేందుకు...

Published date : 10 Aug 2021 06:39PM

Photo Stories