Skip to main content

స్మృతికి ఉత్తమ మహిళా క్రికెటర్ అవార్డు

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు 2018 సంవత్సరానికిగాను ‘ఉత్తమ మహిళా క్రికెటర్’, ‘వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులు లభించాయి.
ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ డిసెంబర్ 31న ప్రకటించారు. దీంతో పేసర్ జులన్ గోస్వామి (2007) తర్వాత ‘ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన భారత క్రికెటర్‌గా 22 ఏళ్ల స్మృతి రికార్డులకెక్కింది. 2018లో స్మృతి 12 వన్డేల్లో 669 పరుగులు (సగటు 66.90), 25 టి20ల్లో 622 పరుగులు (స్ట్రయిక్ రేట్ 130.67) చేసింది. మరోవైపు ఆస్ట్రేలియా ఓపెనర్, వికెట్ కీపర్ అలీసా హీలీకి ‘ఐసీసీ టి20 మహిళా క్రికెటర్’ అవార్డు దక్కింది.

ఐసీసీ టి20 జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్
‘ఐసీసీ టి20 టీమ్ ఆఫ్ ద ఇయర్ 2018’ కెప్టెన్‌గా భారత టి20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ప్రపంచ వన్డే జట్టు కెప్టెన్‌గా న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్ ఎంపికయ్యారు. టి20 ప్రపంచ కప్‌లో హర్మన్ 160.5 స్ట్రయిక్ రేట్‌తో 183 పరుగులు చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉత్తమ మహిళా క్రికెటర్-2018, వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్-2018 అవార్డులు
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : స్మృతి మంధాన
Published date : 01 Jan 2019 06:03PM

Photo Stories