సల్ఫర్ ఎరువుపై రాయితీ 84 పైసలు పెంపు
Sakshi Education
సల్ఫర్ ఎరువుపై రాయితీని కేజీకి 84 పైసలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం ఆ రాయితీ కేజీకి రూ. 2.72 ఉండగా, దానిని రూ. 3.56కు పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం జూలై 31న ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ... యూరియాయేతర, ఇతర పోషక ఎరువులకు ఇస్తున్న రాయితీలో మార్పులేమీ లేవని వెల్లడించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో యూరియాయేతర ఎరువులకు రాయితీ ఇచ్చేందుకు వెచ్చించే మొత్తం రూ. 22,875.5 కోట్లుగా ఉంటుంద న్నారు.
ప్రస్తుతం నైట్రోజన్(ఎన్)పై కేజీకి రూ. 18.9, ఫాస్ఫాటిక్(పీ)పై కేజీకి రూ. 15.21, పొటాసిక్(కే)పై కేజీకి రూ. 11.12లను కేంద్రం రాయితీగా ఇస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సల్ఫర్ ఎరువుపై రాయితీ 84 పైసలు పెంపు
ఎప్పుడు : జూలై 31
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

Published date : 01 Aug 2019 05:49PM