Skip to main content

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్ పై విధించిన నిషేధం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది?

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒకసారి వాడి పారేసే(సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

ఈ నిషేధం 2022, జూలై 1 నుంచి అమల్లోకి రానుంది.ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ ఆగస్టు 12న ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ సవరణ నియమాలు–2021ను ప్రకటించింది. ఇందులో భాగంగా అధిక చెత్తకు కారణమయ్యే ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ వస్తువులను 2021, జూలై నుంచి నిషేధించింది.

గుర్తించిన వస్తువులపై పూర్తిగా నిషేధం...
2021, జూలై 1వ తేదీ నుంచి దేశంలో గుర్తించిన కొన్ని సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ప్లాస్టిక్‌ స్టిక్స్‌తో చేసిన ఇయర్‌ బడ్స్, బెలూన్లకు ప్లాస్టిక్‌ స్టిక్స్, ప్లాస్టిక్‌ జెండాలు, క్యాండీస్‌కు వాడే ప్లాస్టిక్‌ స్టిక్స్, ఐస్‌ క్రీమ్‌ స్టిక్స్, డెకరేషన్‌కు వాడే థర్మోకోల్‌ వస్తువులపై నిషేధం అమలులోకి రానుంది. వీటితోపాటు ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, స్ట్రాలు, ట్రేలు, స్వీట్‌ బాక్సులకు వాడే ప్యాకింగ్‌ పేపర్, ఇన్విటేషన్‌ కార్డులు, సిగరెట్‌ ప్యాకెట్లు, 100మైక్రాన్లకు తక్కువగా ఉండే ప్లాస్టిక్‌ లేదా పీవీసీ బ్యానర్లను నిషేధిత జాబితాలో చేర్చింది.

120మైక్రాన్లకు పెంపు
2020, సెప్టెంబర్‌ 30వ తేదీ నుంచి దేశంలో ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్‌ల మందాన్ని 50 నుంచి 75మైక్రాన్‌లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2022, డిసెంబర్‌ 31 నుంచి ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్‌ల కనీస మందం 120మైక్రాన్లకు పెంచింది. ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల మందం పెరిగిన కారణంగా వాటిని తిరిగి ఉపయోగించేందుకు అనుమతించనుంది.

క్విక్‌ రివ్యూ
:
ఏమిటి :2022, జూలై 1 నుంచిఒకసారి వాడి పారేసే(సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
ఎప్పుడు : ఆగస్టు12
ఎవరు :కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ :దేశవ్యాప్తంగా...
ఎందుకు :పర్యావరణ పరిరక్షణలో భాగంగా...
Published date : 17 Aug 2021 04:40PM

Photo Stories