Skip to main content

సిక్కింలో అత్యంత ఎత్తైన రహదారి నిర్మాణం

సిక్కింలోని కెరంగ్-జొడాంగ్‌ల మధ్య 18,600 అడుగుల ఎత్తులో 19 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణానికి కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
2021కల్లా రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సరిహద్దు రోడ్ల సంస్థ(బీఆర్‌ఓ) అక్టోబర్ 1న తెలిపింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెండో రహదారిగా ఇది నిలుస్తుంది. ఈ ప్రాజెక్టుకు 2015లో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కెరంగ్-జొడాంగ్ ప్రాంతం టూరిజం పరంగా అభివృద్ధి చెందుతున్నందున సాధారణ పౌరులు తిరిగేందుకు కూడా ఆర్మీ అనుమతించే అవకాశం ఉందని బీఆర్‌ఓ పేర్కొంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెండో రహదారి నిర్మాణం
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : సరిహద్దు రోడ్ల సంస్థ(బీఆర్‌ఓ)
ఎక్కడ : కెరంగ్-జొడాంగ్, సిక్కిం
Published date : 02 Oct 2019 04:50PM

Photo Stories