సిక్కిం సరిహద్దుల్లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ
Sakshi Education
ఉత్తర సిక్కింలోని 16 వేల అడుగుల ఎత్తైన నాకు లా ప్రాంతంలో ఉన్న సరిహద్దుల్లో భారత్, చైనా సైనికుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది.
జనవరి 20న జరిగిన ఈ ఘర్షణ ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘర్షణల్లో 20 మంది చైనా సైనికులు, నలుగురు భారత జవాన్లు గాయపడ్డారని జనవరి 25న భారతీయ సైన్యం వెల్లడించింది. ఇరు దేశాల స్థానిక కమాండర్లు ఈ సమస్యను పరిష్కరించారని తెలిపింది. జనవరి 20న ఉత్తర సిక్కింలోని నాకు లా వద్ద వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి వచ్చేందుకు చైనా సైనికులు ప్రయత్నించారు. భారత సైనికులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. దీనిపై తమ వద్ద సమాచారం లేదని చైనా పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, చైనా సైనికుల మధ్య స్వల్ప ఘర్షణ
ఎప్పుడు : జనవరి 20
ఎక్కడ : నాకు లా ప్రాంతం, ఉత్తర సిక్కిం, భారత్-చైనా సరిహద్దు
ఎందుకు : భారత భూభాగంలోకి వచ్చేందుకు చైనా సైనికులు ప్రయత్నించడంతో

Published date : 26 Jan 2021 07:55PM