సీసీఎంబీలో కణ పరిశోధన కేంద్రం ఏర్పాటు
Sakshi Education
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్‌లో ఏప్రిల్ 25న కణాధారిత మాంసం తయారీ పరిశోధన కేంద్రం ఏర్పాటైంది.
కణాధారిత మాంసాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర బయో టెక్నాలజీ విభాగం రూ.4.5 కోట్ల నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. కణాధారిత మాంసం అభివృద్ధిపై జాతీయ మాంసం పరిశోధన సంస్థ, హ్యూమనీ సొసైటీతో కలిసి సీసీఎంబీ పరిశోధనలు చేస్తోందని వివరించారు. ఈ మేరకు సీసీఎంబీ, హ్యూమనీ సొసైటీ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరిందని వెల్లడించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కణాధారిత మాంసం తయారీ పరిశోధన కేంద్రం ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎక్కడ : అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)
క్విక్ రివ్యూ :
ఏమిటి : కణాధారిత మాంసం తయారీ పరిశోధన కేంద్రం ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎక్కడ : అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)
Published date : 27 Apr 2019 05:43PM