సీజేఐ వివాదం విచారణకు కమిటీ
Sakshi Education
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని సుప్రీంకోర్టు నియమించింది.
ఈ కమిటీకి అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వం వహించనుండగా, జస్టిస్ ఎన్‌వీ రమణ, మహిళా జడ్జి జస్టిస్ ఇందిరా బెనర్జీ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. ఈ విచారణ అంతర్గతంగా చేపడతామని జస్టిస్ బాబ్డే తె లిపారు. ఇందులో వాది, ప్రతివాది తరఫున న్యాయవాదులు ఉండరని, విచారణ ప్రక్రియ ముగింపునకు నిర్ణీత గడువు లేదని వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీజేఐ వివాదం విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీ
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీజేఐ వివాదం విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీ
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీ
Published date : 24 Apr 2019 05:19PM