Skip to main content

సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

భారత పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్)లను వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ మార్చి 16న తీర్మానం చేసింది.
Current Affairs ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి ఎంఐఎం, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మద్దతు తెలపగా, బీజేపీ మాత్రం వ్యతిరేకించింది. తీర్మానంపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సీఏఏ కేవలం హిందూ, ముస్లింల సమస్య కాదని.. యావత్ దేశ సమస్య అని, నిమ్న వర్గాలు, సంచార జాతులు, మహిళలు, పేదలు, వలసదారులు ఈ చట్టంతో భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు.

ద్రవ్య బిల్లుకు ఆమోదం..
రాష్ట్ర ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,914 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా చర్చ అనంతరం ఉభయ సభలు ఆమోద ముద్రవేశాయి.

చదవండి: తెలంగాణ బడ్జెట్ 2020-21
Published date : 17 Mar 2020 08:51PM

Photo Stories