Skip to main content

సీఏఏ రద్దు చేయాలని కేరళ అసెంబ్లీ తీర్మానం

పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) రద్దు చేయాలని కేరళ అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. . ఈ మేరకు డిసెంబర్ 31న ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి అధికార సీపీఐ(ఎం)-ఎల్డీఎఫ్ కూటమితోపాటు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష యునెటైడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కూడా మద్దతుగా నిలిచింది.
Current Affairs అస్సాం సాంస్కృతిక యోధుడు ఓఝా మృతి
అస్సాం సాంస్కృతిక, నాటక రంగ ప్రముఖుడు ఒయినింటమ్ ఓఝా(88) డిసెంబర్ 31న కన్నుమూశారు. అస్సాంలో జరిగిన సీఏఏ వ్యతిరేక నిరసనల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు.

టూరిజంకు భారీ నష్టం
సీఏఏకు వ్యతిరేకంగా అస్సాంలో జరిగిన ఆందోళనల కారణంగా రాష్ట్ర పర్యాటక రంగానికి 2019. డిసెంబర్‌లో రూ. 500 కోట్ల నష్టం వాటిల్లింది. 2020, జనవరిలో మరో రూ. 500 కోట్లు నష్టపోయే అవకాశముందని అస్సాం టూరిజం తెలిపింది. రాష్ట్రంలో పర్యాటక రంగం ద్వారా ప్రత్యక్షంగా 50 వేల మంది, పరోక్షంగా లక్ష మంది ఉపాధి పొందుతున్నారని అధికారులు తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) రద్దు చేయాలని తీర్మానం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : కేరళ అసెంబ్లీ
Published date : 01 Jan 2020 07:31PM

Photo Stories