Skip to main content

సీడీఎస్‌గా జనరల్ రావత్ బాధ్యతల స్వీకరణ

దేశ మొట్టమొదటి రక్షణ బలగాల అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్‌‌స స్టాఫ్ - సీడీఎస్)గా జనరల్ బిపిన్ రావత్ జనవరి 1న బాధ్యతలు స్వీకరించారు.
Current Affairs
ఆర్మీ చీఫ్‌గా డిసెంబర్ 31న రావత్ పదవీ విరమణ చేశారు. సీడీఎస్‌గా రావత్ నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీ 2019, డిసెంబర్ 30న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. త్రివిధ బలగాలకు సంబంధించి రక్షణ మంత్రికి అన్ని అంశాల్లోనూ సలహాదారుగా ఉండడం, మూడు బలగాల మధ్య సమన్వయం సాధిస్తూ ఉన్న వనరులనే సంపూర్ణంగా సద్వినియోగం చేయడమే సీడీఎస్ ప్రధాన విధి.

బాధ్యతల స్వీకరణ సందర్భంగా రావత్ మాట్లాడుతూ... సాయుధ బలగాలు రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తాయని అన్నారు. మూడు దళాలు సమన్వయంతో కలసికట్టుగా పనిచేయాలని, అలా చేసేలా చూడడమే సీడీఎస్ పని అని స్పష్టం చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : సీడీఎస్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : జనరల్ బిపిన్ రావత్

మాదిరి ప్రశ్నలు
1. ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ ఏ నగరంలో ఉంది?
1. థానే
2. పుణె
3. ముంబై
4. నాగ్‌పూర్
Published date : 02 Jan 2020 06:18PM

Photo Stories