Skip to main content

సెంట్రల్‌ విజిలెన్స్ కమిషనర్‌గా సంజయ్‌ కొఠారి

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్‌ కొఠారి సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌(సీవీసీ)గా నియమితులయ్యారు.
Current Affairs

ఈ మేర‌కు ఏప్రిల్ 25న కొరాఠీ చేత రాష్ట్రపతి రామ్‌నాథ్ ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ హాజ‌ర‌య్యారు. 1978 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన కొఠారి, హరియాణా కేడర్‌కు చెందిన వారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఆయన 2016లో పదవీ విరమణ చేశారు. అనంతరం ప్రభుత్వ రంగ సంస్థల పదవుల ఎంపిక బోర్డు(పీఈఎస్‌బీ)కు చైర్మన్‌గా నియమితులయ్యారు. 2017లో రాష్ట్రపతి కోవింద్‌కు కార్యదర్శిగా ఎంపికయ్యారు. సీవీసీగా ఆయన 2021 జూన్‌ వరకు కొనసాగుతారు.


ప్రధాని నేతృత్వంలోని హోం మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ నేత సభ్యులుగా ఉండే కమిటీ సీవీసీని ఎంపిక చేయడం ఆనవాయితీ. సీవీసీ పదవీ కాలం నాలుగేళ్లు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు ఉంటారు. సీవీసీ కేవీ చౌదరి గత ఏడాది జూన్‌లో రిటైరైనప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. కాగా, రాష్ట్రపతి కోవింద్‌ కార్య దర్శిగా పీఈఎస్‌బీ చైర్మన్‌ కపిల్‌ దేవ్‌ త్రిపాఠీని ఏప్రిల్ 20వ తేదీన కేంద్రం నియమించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌(సీవీసీ)గా నియామ‌కం
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : సంజయ్‌ కొఠారి
Published date : 27 Apr 2020 07:08PM

Photo Stories