శౌర్య క్షిపణి పరీక్ష విజయవంతం
Sakshi Education
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చేపట్టిన హైపర్ సోనిక్ మిసైల్ ‘శౌర్య’ పరీక్ష విజయవంతమైంది.
ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ కాంప్లెక్స్ 4 నుంచి అక్టోబర్ 3న ఈ ప్రయోగం జరిగింది. ఉపరితలం నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించగల ఈ క్షిపణి 10 మీటర్ల పొడవు, 74 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉండి, 6.2 టన్నుల బరువు ఉంటుంది. 700 నుంచి 1,000 కిలోమీటర్ల దూరాల్లోని లక్ష్యాలను ఛేదించగలదు. 200 నుంచి 1,00 కేజీల పేలోడ్ ను తీసుకెళ్లగలదు. అణు సామర్థ్యం గల ఈ క్షిపణిని పూర్తి దేశీయ పరిజ్ఙానంతో అభివృద్ధి చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హైపర్ సోనిక్ మిసైల్ ‘శౌర్య’ పరీక్ష విజయవంతం
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)
ఎక్కడ : బాలాసోర్, ఒడిశా
క్విక్ రివ్యూ :
ఏమిటి : హైపర్ సోనిక్ మిసైల్ ‘శౌర్య’ పరీక్ష విజయవంతం
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)
ఎక్కడ : బాలాసోర్, ఒడిశా
Published date : 06 Oct 2020 11:42AM