సైకాలజిస్ట్ లక్ష్మణ్‌కు ఇన్‌స్పిరేషనల్ లీడర్ అవార్డు
Sakshi Education
ప్రముఖ మానసిక శిక్షణ నిపుణుడు డా.పి.లక్ష్మణ్‌కు ఇన్‌స్పిరేషనల్ లీడర్ అవార్డు లభించింది.
ఢిల్లీలో ఆగస్టు 24న జరిగిన ఎడ్యుకేషన్ ఐకాన్ సంస్థ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అర్జెంటీనా రాయబారి డెనియల్ చుబురు చేతుల మీదుగా లక్ష్మణ్ అవార్డు అందుకున్నారు. లక్ష్మణ్ సేవలకు గుర్తింపుగా సామాజిక సేవా విభాగంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఐకాన్ సంస్థ ఈ అవార్డును ప్రదానం చేసింది.
నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల్ మండలం ఎన్‌సీ తాండకు చెందిన లక్ష్మణ్ గత కొన్నేళ్లుగా దేశ వ్యాప్తంగా వివిధ వర్గాల వారికి పర్సనాలిటీ డెవలప్‌మెంట్, సైకాలజీ కౌన్సెలింగ్, మానసిక శిక్షణలో అవగాహన కల్పిస్తున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఏడుసార్లు ఉత్తమ సామాజిక సేవా విభాగంలో అవార్డులు ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఐకాన్- ఇన్‌స్పిరేషనల్ లీడర్ అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : డా.పి.లక్ష్మణ్
ఎందుకు : సామాజిక సేవకు గుర్తింపుగా

Published date : 26 Aug 2019 05:57PM