Skip to main content

సైబర్‌ మోసాలపై ఫిర్యాదుకు కేంద్రం తెచ్చిన హెల్ప్‌లైన్‌ నంబర్?

సైబర్‌ మోసాలను ఆపి నేరగాళ్ల అకౌంట్లను స్తంభింపజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక వ్యవస్థను రూపొందించింది.
Current Affairs
మోసాన్ని గుర్తించి (మీ అకౌంట్ల నుంచి డబ్బు పోయినట్లు గుర్తించగానే) వెంటనే ఫిర్యాదు చేసేందుకు కేంద్ర హోంశాఖ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 155260 అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్‌లో నంబర్‌ను ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం మరికొన్ని రాష్ట్రాలకు దీనిని విస్తరించారు.

ఆర్‌బీఐ సహా అన్ని ప్రధాన బ్యాంకులు, పేమెంట్‌ బ్యాంకులు, వ్యాలెట్లు, ఆన్‌లైన్‌ వాణిజ్య సంస్థ సహకారంతో 155260 హెల్ప్‌లైన్‌ను హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో–ఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సి) నిర్వహిస్తోంది. ఈ మేరకు సిటిజెన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్, మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో (ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌) హెల్ప్‌లైన్‌ అమల్లో ఉంది. డబ్బును ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేసిన తర్వాత త్వరగా ఫిర్యాదు చేస్తే వెనక్కి రప్పించడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : అమల్లోకి 155260 హెల్ప్‌లైన్‌ నంబర్‌
ఎప్పుడు : జూన్‌ 17
ఎవరు : కేంద్ర హోంశాఖ
ఎక్కడ : దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో
ఎందుకు : సైబర్‌ మోసాల నియంత్రణకు...
Published date : 18 Jun 2021 06:11PM

Photo Stories