సాయుధ బలగాలకు 20 కోట్ల విరాళం : బీసీసీఐ
Sakshi Education
దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సాయుధ బలగాలకు రూ. 20 కోట్ల విరాళం అందజేయనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మార్చి 16న తెలిపింది.
మన సైనికుల మరణం వల్ల విషాదం నెలకొనడంతో ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకల్ని రద్దు చేసిన బీసీసీఐ అదే రోజు(మార్చి 23) రూ. 20 కోట్లను త్రివిధ దళాధిపతులకు అందజేయనుంది. పుల్వామా ఘటనలో 40 మంది భారత సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందడంపై ఇప్పటికే క్రికెటర్లు స్పందించారు. ఆర్మీ క్యాప్‌లతో బరిలోకి దిగి తమ మ్యాచ్ పారితోషికాన్ని (రూ. కోటి పైచిలుకు) ఆర్మీ నిధికి పంపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సాయుధ బలగాలకు 20 కోట్ల విరాళం
ఎప్పుడు : మార్చి 16
ఎవరు : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)
క్విక్ రివ్యూ :
ఏమిటి : సాయుధ బలగాలకు 20 కోట్ల విరాళం
ఎప్పుడు : మార్చి 16
ఎవరు : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)
Published date : 18 Mar 2019 05:55PM