శాసనమండలి ఏర్పాటుకు ఆమోదం తెలిపిన రాష్ట్ర అసెంబ్లీ?
Sakshi Education
శాసనమండలి ఏర్పాటుకు పశ్చిమబెంగాల్ అసెంబ్లీ జూలై 6న ఆమోదం తెలిపింది.
తీర్మానానికి 265మంది సభ్యుల్లో 196 మంది ఆమోదం తెలిపారు. ప్రస్తుత తీర్మానానికి గవర్నర్ ఆమోదం తెలపాల్సిఉంది. అనంతరం పార్లమెంట్‌లో బిల్లు పాస్ కావాల్సిఉంటుంది. ప్రస్తుతం దేశంలోని 6 రాష్ట్రాల్లో శాసనమండళ్లున్నాయి. ఎన్నికల్లో తమ పార్టీ మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానంలో భాగంగా మండలి ఏర్పాటు చేయనున్నట్లు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు.
ప్రస్తుతం శాసన మండలిని కలిగిన రాష్ట్రాలు...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్
క్విక్ రివ్యూ :
ఏమిటి : శాసనమండలి ఏర్పాటుకు ఆమోదం తెలిపిన రాష్ట్ర అసెంబ్లీ?
ఎప్పుడు : జూలై 6
ఎవరు : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ

Published date : 07 Jul 2021 05:33PM