Skip to main content

శారదా పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర

విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీని నియమిస్తున్నట్టు పీఠాధిపతి మహాస్వామి స్వరూపానందేంద్ర సరస్వతి జూన్ 17న అధికారిక ప్రకటన చేశారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కృష్ణా తీరంలో గల గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో మూడు రోజులపాటు నిర్వహించిన శారదా పీఠం ఉత్తరాధికారి శిష్య తురియాశ్రమ దీక్షా మహోత్సవం జూన్ 17న పరిసమాప్తమైంది. 2024లో శారదా పీఠం పూర్తి బాధ్యతలను స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీకి అప్పగించనున్నట్లు స్వరూపానందేంద్ర తెలిపారు.

శారదా పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు చేపట్టిన స్వాత్మానందేంద్ర అసలు పేరు కిరణ్‌కుమార్‌శర్మ. విశాఖ జిల్లా భీముని పట్నానికి చెందిన హనుమంతరావు, ప్రభావతమ్మ దంపతులకు 1993 ఏప్రిల్ 4న ఆయన జన్మించారు. తన 5వ ఏటనే శారదా పీఠానికి వెళ్లిన కిరణ్‌కుమార్‌శర్మ నాటినుంచీ మహాస్వామి స్వరూపానందేంద్ర స్వామీజీ చెంతనే ఉన్నారు. మహాస్వామికి ఆంతరంగిక శిష్యునిగా కొనసాగిన ఆయన దూరవిద్య విధానంలో డిగ్రీ పూర్తి చేశారు. తర్కం, మీమాంస, వేదాంతం, ఉపనిషత్తులు, శంకరాచార్యుల వారి భాష్యాలు, బ్రహ్మసూత్రాలును ఔపోసన పట్టారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారిగా నియామకం
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ
Published date : 18 Jun 2019 05:26PM

Photo Stories