Skip to main content

శాంతికి భారత్ కృషి చేయాలి : ఇరాన్

ఇరాన్-అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ తీసుకునే ఎలాంటి శాంతి చర్యలనైనా ఇరాన్ స్వాగతిస్తుందని భారత్‌లో ఆ దేశ రాయబారి అలీ చెగెనీ పేర్కొన్నారు.
Current Affairsఇరాన్-అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగబోవని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. సులేమానీకి నివాళులర్పించేందుకు ఇరాన్ ఎంబసీలో జనవరి 9న ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో చెగెనీ ఈ మేరకు మాట్లాడారు.

ఇరాక్ వెళ్లకండి : భారత్
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాక్ వెళ్లాలనుకునే పర్యాటకులకు భారత్ జనవరి 9న పర్యాటక సూచన జారీ చేసింది. ‘అంతగా అవసరం లేని ప్రయాణమైతే రద్దు చేసుకోండి’ అని ఇరాక్ వెళ్లే భారత ప్రయాణీకులకు భారత విదేశాంగ శాఖ సూచించింది. ఇరాక్‌లోని భారతీయులు సైతం జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలు అస్సలు చేయవద్దని సూచించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
శాంతికి భారత్ కృషి చేయాలి
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : భారత్‌లో ఇరాన్ రాయబారి అలీ చెగెనీ
ఎందుకు : ఇరాన్-అమెరికాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో
Published date : 09 Jan 2020 05:37PM

Photo Stories