Skip to main content

సామాజిక న్యాయ శిబిరంలో ప్రధాని మోదీ

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(అలహాబాద్)లో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు సహాయపడే ఉపకరణాల పంపిణీ కార్యక్రమం సామాజిక న్యాయ శిబిరంలో ఫిబ్రవరి 29న ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
Current Affairsసుగమ్య భారత్ అభియాన్ పథకంలో భాగంగా విమానాశ్రయాల్లో, 700కి పైగా రైల్వే స్టేషన్లలో దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ప్రస్తుతం దేశంలో 2.50 కోట్ల మందికి పైగా దివ్యాంగులుంటే, 10 కోట్ల మందికి పైగా సీనియర్ సిటిజన్లు ఉన్నారు.

బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన
ఉత్తరప్రదేశ్‌లో 296కి.మీ.ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. చిత్రకూట్, బాందా, హమీర్‌పూర్, జలాన్ జిల్లాల మీదుగా మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ని కలుపుతూ ఈ ఎక్స్‌ప్రెస్‌వే సాగుతుంది.

గిన్నిస్ రికార్డుల్లోకి...
అలహాబాద్‌లో త్రివేణి సంగమం వద్ద పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సామాజిక న్యాయ కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది. ఈ మెగా క్యాంప్‌లో 56 వేలకు పైగా వివిధ రకాల ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేశారు. 26 వేల మంది లబ్ధిదారులు వాటిని అందుకున్నారు. హియరింగ్ ఎయిడ్‌లు, కృత్రిమ పాదాలు, బ్యాటరీతో నడిచే త్రిచక్ర వాహనాలు ఉన్నాయి. ఈ పరికరాలకే రూ.19 కోట్లకు పైగా ఖర్చు అయింది. మొత్తం మూడు రికార్డులను సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 28న 1.8 కి.మీ. పొడవునా 300 మంది దివ్యాంగులు కూర్చున్న త్రిచక్ర వాహనాల పెరేడ్ గిన్నిస్ రికార్డుని సొంతం చేసుకుంది. ఒకే వేదికపై నుంచి భారీ స్థాయిలో పరికరాల పంపిణీ, ఆ తర్వాత వీల్ చైర్ల పెరేడ్ కూడా గిన్నిస్ రికార్డులకెక్కింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సామాజిక న్యాయ శిబిరం
ఎప్పుడు : ఫిబ్రవరి 29
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్
ఎందుకు : సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు సహాయపడే ఉపకరణాల పంపిణీ కోసం
Published date : 02 Mar 2020 05:38PM

Photo Stories