Skip to main content

సాహిత్య అవార్డు గ్రహీత సదానంద కన్నుమూత

చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కలువకొలను సదానంద (81) ఆగస్టు 25న కన్నుమూశారు.
Current Affairs
1939 ఫిబ్రవరి 22న పాకాలలో జన్మించిన ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. సదానంద అనేక బాలల కథలు, గేయాలు, కవితలు, నవలలు కథానికలు, నాటికలు రచించారు. గ్రామీణ జీవితంతో పాటు పట్టణ జీవితాన్ని కూడా తన కథల్లో చూపించారు. రచయితగానే కాక, చిత్రకారుడుగా, కార్టూనిస్టుగా కూడా తెలుగు ప్రజలకు ఆయన చిరపరిచితులు. ప్రైమరీ టీచర్‌గా 36 ఏళ్లు పనిచేసి 1997లో రిటైరయ్యారు.

సాహిత్య అవార్డు కైవసం...
  • కథ, నవల, కవిత్వం, ముఖ్యంగా గేయాలు వంటి వివిధ ప్రక్రియల్లో సదానంద రచనలు చేశారు.
  • రక్తయజ్ఞం, పైరుగాలి, నవ్వే పెదవులు ఏడ్చేకళ్లు వంటివి వీరి కథా సంపుటాలు. గాడిద బ్రతుకులు, గందరగోళం, బంగారు మామ వంటి నవలలు రాశారు.
  • ఈయన ‘నవ్వే పెదవులు–ఏడ్చే కళ్లు కథా సంపుటికి 1976లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
  • 1990లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్నిన్ని, 1992లో కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ బహుమతిని అందుకున్నారు.
  • ‘బంగారు నడిచిన బాట’ నవలకు ఉత్తమ బాలసాహిత్య అవార్డును కేంద్రం నుంచి అందుకున్నారు.
  • ‘అడవి తల్లి’ నవలకు 2010లో కేంద్ర సాహిత్య అవార్డును కైవశం చేసుకున్నారు.
  • ఆయన రాసిన ‘బంగారు మామ’ నవల, ‘బంగారు బావ’ చలన చిత్రంగా నిర్మితమయ్యాయి. ఈయన కలం నుంచి పది పిల్లల నవలలు, ఏడు సాంఘిక నవలలు, ఒక కవితా సంపుటి, ఏడు కథా సంపుటాలు వెలువడ్డాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతకన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 25
ఎవరు : కలువకొలను సదానంద (81)
ఎక్కడ :పాకాల, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 26 Aug 2020 05:35PM

Photo Stories