Skip to main content

సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌కు ఎంపికైన 14వ పండితుడు?

సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన కేంద్ర సాహిత్య అకాడమీ గౌరవ ఫెలోషిప్‌కు విశిష్ట పండితుడు, రచయిత, అనువాదకులు ప్రొఫెసర్‌ వేల్చేరు నారాయణరావు ఎంపికయ్యారు.
Current Affairs
సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్‌ చంద్రశేఖర్‌ అధ్యక్షతన జరిగిన... సాహిత్య అకాడమీ జనరల్‌ కౌన్సిల్‌ 92వ సమావేశంలో వేల్చేరు పేరును ఎంపిక చేశారు. ఈ విషయాన్ని అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు ఫిబ్రవరి 26న తెలిపారు. దీంతో గౌరవ ఫెలోషిప్‌కు ఎన్నికైన 14వ పండితుడిగా వేల్చేరు గుర్తింపు పొందారు.

ఏలూరు టు అమెరికా...
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరానికి చెందిన వేల్చేరు నారాయణరావు 1933లో శ్రీకాకుళం జిల్లా అంబఖండి గ్రామంలో జన్మించారు. ఏలూరు సీఆర్‌ఆర్‌ కళాశాలలో చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ చేసి, ఏలూరు సీఆర్‌ఆర్‌లోనే అధ్యాపకునిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఆయన ప్రొఫెసర్‌గా పనిచేశారు.

దక్షిణ భారత సాహిత్యాన్ని...
వేల్చేరు సాహిత్య రంగానికి విశిష్ట సేవలు అందించారు. దక్షిణ భారత సాహిత్యాన్ని, ముఖ్యంగా తెలుగు సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేసి ప్రపంచానికి పరిచయం చేశారు.

ఆయన రాసిన కొన్ని ఆంగ్ల పుస్తకాలు...
  • గరల్స్‌ ఫర్‌ సేల్‌ : కన్యాశుల్కం
  • ఏ ప్లే ఫ్రమ్‌ కొలొనియల్‌ ఇండియా
  • గాడ్‌ ఆన్‌ హిల్‌ : టెంపుల్‌ సాంగ్స్‌ ఫ్రమ్‌ తిరుపతి
  • టెక్స్చర్స్‌ ఆఫ్‌ టైమ్‌ : రైటింగ్‌ హిస్టరీ ఇన్‌ సౌత్‌ ఇండియా
  • హైబిస్కస్‌ ఆన్‌ ది లేక్‌ : ట్వంటీయత్‌ సెంచరీ తెలుగు పోయెట్రీ ఫ్రమ్‌ ఇండియా

రామానుజన్‌ బహుమతి
...
జెరూసలేంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఆఫ్‌ హిబ్రూ యూనివర్సిటీలో, మాడిసన్‌ యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ హ్యుమానిటీస్‌లో ఫెలోగా వేల్చేరు ఉన్నారు. అనువాద రచనలకుగాను ఆయన ఏకే రామానుజన్‌ బహుమతి అందుకున్నారు.

సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌ అంటే?
దేశంలోని ఉద్ధండ సాహితీవేత్తలను మాత్రమే సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌కు ఎంపికచేస్తారు. ఈ పురస్కారాలు ప్రకటించే ప్రతీసారి ఇరవై మంది లేదా అంతకు తక్కువ మందిని ఎంపిక చేస్తారు. 1968 నుంచి 2018 వరకు సుమారు వంద మంది వరకు ఈ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు.

సాహిత్య అకాడమీ అవార్డు అంటే?
దేశంలోని సాహితీవేత్తలు రచించిన అత్యుత్తమ రచనలను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. దేశంలోని 24 ప్రధాన భాషల్లో మాత్రమే రచనలై ఉండాలి.

గౌరవ ఫెలోషిప్‌లు ఎవరికి ఇస్తారు?
ఇది సాహిత్య రంగంలో విశేష కృషిచేస్తున్న వారికి సాహిత్య అకాడమీ అందించే అత్యున్నత పురస్కారం. భారత పౌరులు కాని వారిని మాత్రమే ఇందుకు ఎంపిక చేస్తారు. ఈ ఫెలోషిప్‌కు ఇప్పటివరకు 14 మంది ఎంపికయ్యారు. వారు...
1) కట్సూర కోగ (2015)
2) ప్రొ.కిమ్‌యాంగ్‌ షిక్‌ (2014)
3) డా. జిన్‌ దిన్‌ హాన్‌ (2014)
4) డా. అభిమన్యు ఉన్నుత్‌ (2013)
5) సర్‌ విఎస్‌ నైపాల్‌ (2010)
6) ప్రొ. ఆర్‌ఈ ఆషెర్‌ (2007)
7) డా.వాస్సిలిస్‌ విట్సాక్సిస్‌ (2002)
8) ప్రొ. ఇ.పి. చెలిషెవ్‌ (2002)
9) ప్రొ. ఎడ్వర్డ్‌ సి. డిమొక్‌ (1996)
10) ప్రొ. డేనియల్‌ హెచ్‌హెచ్‌ ఇంగాల్స్‌ (1996)
11) ప్రొ. కామిల్‌ వి.జ్వెలెబిల్‌ (1996)
12) ప్రొ.జి జియాంగ్‌ లిన్‌ (1996)
13) లియోపోల్డ్‌ సేదర్‌ సెన్‌ఘర్‌ (1974)
14) వేల్చేరు నారాయణరావు(2021)

క్విక్‌ రివ్యూ
:
ఏమిటి : సాహిత్య అకాడమీ గౌరవ ఫెలోషిప్‌కు ఎంపికైన 14వ పండితుడు?
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : వేల్చేరు నారాయణరావు
ఎందుకు : సాహిత్య రంగంలో విశేష కృషిచేస్తున్నందున
Published date : 27 Feb 2021 05:52PM

Photo Stories