రూ. 2 వేల నోట్ల ముద్రణ నిలిపివేత
Sakshi Education
నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం... రూ. 2 వేల నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది.
2016, నవంబర్ 8న రూ. 1,000, పాత 500 నోట్లను రద్దు చేసి దాని స్థానంలో రూ. 2,000 నోటును ప్రవేశపెట్టిన ప్రభుత్వం క్రమంగా దాని ముద్రణను తగ్గిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా 2016–17లో ఏకంగా రూ. 354.29 కోట్ల రూ. 2 వేల నోట్లను ప్రింటింగ్ చేసిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.. గతేడాది నుంచి ఈ నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది. 2016 నుంచి ఇప్పటివరకు ముద్రించిన కరెన్సీ నోట్ల సంఖ్య వివరాలపై ఆర్టీఐ కార్యకర్త జలగం సుధీర్ చేసిన దరఖాస్తుకు సమాధానంగా ఆర్‌బీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది.
నాలుగేళ్లు.. 7,071 కోట్ల నోట్లు...
గత నాలుగేళ్లలో 7071.63 కోట్ల కొత్త నోట్లను ఆర్‌బీఐ ముద్రించింది. ఇందులో రూ. 500 నోట్లు 2458 కోట్లు ఉండగా.. రూ. 2 వేల నోట్లు 370 కోట్లు ఉన్నాయి. గతంతో పోలిస్తే రూ. 10, రూ. 50, రూ. 100, రూ. 200 నోట్ల ప్రింటింగ్‌ను కూడా రిజర్వ్ బ్యాంక్ తక్కువ చేసింది. డిజిటల్ పేమేంట్లకుప్రోత్సాహాకాలు ఇస్తున్నందున చిన్ననోట్ల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని భావిస్తున్న ఆర్‌బీఐ... వ్యయం తగ్గింపులో భాగంగా ఈ నోట్ల ముద్రణను కూడా క్రమేణా తగ్గిస్తోంది. నాణేలను అందుబాటులోకి తెచ్చినందున గత నాలుగేళ్ల నుంచి రూ. 1, 2, 5 నోట్లను ముద్రణను ఆపేసింది.
గత నాలుగేళ్లుగా ముద్రించిన నోట్ల సంఖ్య (కోట్లలో)

సంవత్సరం | రూ. 500 నోటు | రూ. 2 వేల నోటు |
2016–17 | 429.22 | 354.29 |
2017–18 | 578.10 | 11.15 |
2018–19 | 628.48 | 4.66 |
2019–20 | 822.77 | – |
మొత్తం | 2,458.57 | 370.1 |
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ. 2 వేల నోట్ల ముద్రణ నిలిపివేత
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : భారతీయ రిజర్వు బ్యాంక్
ఎందుకు:నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు
ఏమిటి : రూ. 2 వేల నోట్ల ముద్రణ నిలిపివేత
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : భారతీయ రిజర్వు బ్యాంక్
ఎందుకు:నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు
Published date : 11 Aug 2020 06:01PM