రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఏడో స్థానం
Sakshi Education
రోడ్డు ప్రమాదాల విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో నిలిచింది.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నవంబర్ 19న విడుదల చేసిన ‘భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు-2018’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం... రోడ్డు ప్రమాదాల్లో 2014లో ఏపీ 8వ స్థానంలో ఉండగా.. 2015, 2016, 2017, 2018లలో ఏడో స్థానంలో నిలిచింది.
రోడ్డు ప్రమాదాల నివేదికలోని అంశాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఏడో స్థానం
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు-2018 నివేదిక
ఎక్కడ : దేశంలో
రోడ్డు ప్రమాదాల నివేదికలోని అంశాలు
- ఆంధ్రప్రదేశ్ 2017లో 25,727, 2018లో 24,475 ప్రమాదాలు సంభవించాయి.
- మృతుల సంఖ్యలో 2017లో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానం ఉండగా.. 2018లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 2017లో 8,060 మంది మృతి చెందగా, 2018లో 7,556 మంది మరణించారు.
- రోడ్డు ప్రమాదాల్లో 2018లో తొలి ఆరు స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నిలిచాయి.
- 2018లో దేశంలో రోడ్డు ప్రమాదాలు 0.46 శాతం పెరిగాయి.
- 2017లో 4,64,910 ప్రమాదాలు సంభవించగా, 2018లో 4,67,044 ప్రమాదాలు సంభవించాయి. ఇదేసమయంలో రోడ్డు ప్రమాద మరణాలు 2.37 శాతం పెరిగాయి.
- 2017లో 1,47,913 మంది, 2018లో 1,51,471 మంది మృతి చెందారు.
- మొత్తం రోడ్డు నెట్‌వర్క్‌లో 1.94 శాతం మాత్రమే ఉన్న జాతీయ రహదారులపైనే మొత్తం ప్రమాదాల్లో 30.2 శాతం ప్రమాదాలు జరిగాయి.
- రాష్ట్ర రహదారుల నెట్‌వర్క్ 2.97 శాతం మాత్రమే ఉండగా మొత్తం ప్రమాదాల్లో 25.2 శాతం వీటిపైనే సంభవించాయి.
- రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిలో పాదచారుల సంఖ్య 15 శాతం.. సైక్లిస్టుల సంఖ్య 2.4 శాతం, ద్విచక్రవాహనదారుల సంఖ్య 36.5 శాతం.
- మొత్తం ప్రమాద మరణాణాల్లో పురుషుల సంఖ్య 86 శాతం ఉండగా, మహిళలు 14 శాతం వరకు ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఏడో స్థానం
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు-2018 నివేదిక
ఎక్కడ : దేశంలో
Published date : 20 Nov 2019 04:36PM