రంగవల్లి నవలను రచించిన తెలుగు రచయిత?
Sakshi Education
ప్రముఖ రచయిత, వ్యాసకర్త డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి (86) హైదరాబాద్‌లో ఫిబ్రవరి 6న కన్నుమూశారు.
1935 డిసెంబర్ 29న తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు గ్రామంలో జన్మించిన పోరంకి... తెలుగు అకాడమీ ఉప సంచాలకునిగా పనిచేసి 1993లో పదవీ విరమణ చేశారు. అనేక నవలలు, కథలు, కథానికలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. ‘వెలుగు వెన్నెల గోదావరి’ నవలను ఉత్తరాంధ్ర, ‘ముత్యాల పందిరి’ నవలను తెలంగాణ, ‘రంగవల్లి’ నవలను రాయలసీమ మాండలికాల్లో రాశారు. పరమహంస యోగానంద రాసిన ‘యాన్ ఆటో బయోగ్రఫీ ఆఫ్ సెయింట్’ అనే పుస్తకాన్ని దక్షిణామూర్తి ‘ఒక యోగి ఆత్మకథ’ పేరిట తెలుగులో అనువదించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ రచయిత, వ్యాసకర్త కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి (86)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : వృద్ధాప్య సమస్యల కారణంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ రచయిత, వ్యాసకర్త కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి (86)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : వృద్ధాప్య సమస్యల కారణంగా
Published date : 08 Feb 2021 06:18PM