రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడులు పెట్టనున్న అమెరికా సంస్థ?
Sakshi Education
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్‌ఆర్‌వీఎల్)లో అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్‌లేక్ పార్ట్‌నర్స్ 1.75 శాతం వాటా కొనుగోలు చేయనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్‌ఆర్‌వీఎల్)లో 1.75 శాతం వాటా కొనుగోలు
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : సిల్వర్‌లేక్ పార్ట్‌నర్స్
ఇందుకోసం రూ. 7,500 కోట్లు వెచ్చించనుంది. ఆర్‌ఆర్‌వీఎల్ సెప్టెంబర్ 9న ఒక ప్రకటనలో ఈ విషయాలు వెల్లడించింది. ఈ పెట్టుబడుల ప్రకారం ఆర్‌ఆర్‌వీఎల్ విలువ సుమారు రూ. 4.21 లక్షల కోట్లుగా ఉంటుందని తెలిపింది. సిల్వర్‌లేక్ ఇప్పటికే జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.35 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది.
- రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ప్రస్తుత విలువ రూ. 4.21 లక్షల కోట్లు
- 2019-20లో మొత్తం ఆదాయం రూ. 1.63లక్షల కోట్లు
- 2019-20లో స్థూల లాభం రూ.9,654 కోట్లు
క్విక్ రివ్యూ :
ఏమిటి : రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్‌ఆర్‌వీఎల్)లో 1.75 శాతం వాటా కొనుగోలు
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : సిల్వర్‌లేక్ పార్ట్‌నర్స్
Published date : 10 Sep 2020 05:13PM