Skip to main content

రెవెన్యూ రికార్డుల్లో ఎలక్ట్రానిక్‌ ఇంటర్వెన్షన్‌ ప్రవేశపెడుతున్న తొలి రాష్ట్రం ?

తెలంగాణలో భూ రికార్డుల సమీకృత నిర్వహణ కోసం రూపొందించిన ‘ధరణి పోర్టల్‌’ ప్రారంభమైంది.
Current Affairs

మేడ్చల్‌ –మల్కాజ్‌గిరి జిల్లా మూడు చింతల పల్లిలో అక్టోబర్ 29న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ... దేశంలో తొలిసారిగా రెవెన్యూ రికార్డుల్లో ఎలక్ట్రానిక్‌ ఇంటర్వెన్షన్‌ ప్రవేశపెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఈ వెబ్‌సైట్‌లో గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా రైతుల సర్వే నంబర్లతో సహా భూముల వివరాలను పొందుపరుస్తారు.


ముఖ్యమంత్రి ప్రసంగం...
  • ధరణి పోర్టల్‌ భారత దేశానికే ట్రెండ్‌సెట్టర్‌. ప్రపంచంలో క్లీన్‌ ల్యాండ్‌ రికార్డులున్న ప్రాంతం భారతదేశంలోని తెలంగాణ అని ప్రపంచవ్యాప్తంగా పేరురావాలి.
  • దేశంలో తొలిసారిగా రెవెన్యూ రికార్డుల్లో ఎలక్ట్రానిక్‌ ఇంటర్వెన్షన్‌ ప్రవేశపెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం. శాశ్వతంగా భూ బాధలుపోవాలి.
  • ‌‌‌- తెలంగాణలోని ప్రతి ఇంచు జాగాను డిజిటల్‌ మెకానిజంలో పూర్తిగా సర్వే చేస్తం. గట్టు నిర్ణయించి అక్షాంశాలు, రేఖాంశాలు రికార్డు చేస్తరు.
  • పహణీలో ఇంతకుముందు 33 కాలమ్స్‌ ఉండే. ఇప్పుడే మూడే మూడు ఉంటయి. రైతు పేరు, పట్టాదారుపేరు ఉంటది. ఏయే కాలం (పంట కాలం) ఉంటది.
  • ధరణి వచ్చిన తర్వాత భూముల మార్పిడి ఇక జరగదు. సాదాబైనామాలకు ప్రభుత్వం ఇప్పటికే చిట్టచివరి అవకాశమిచ్చింది. ఆ తర్వాత కేవలం రిజిస్ట్రేషన్‌ ద్వారానే భూమి మారుతుంది.
  • గరిష్టంగా 15-20 నిమిషాల్లో అప్పటికప్పుడే భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ అయిపోతుంది. ధరణి పోర్టల్‌/ మీ సేవ/ వ్యక్తిగతంగా ఆఫీసుకు పోయి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • భూమి రిజిస్ట్రేషన్‌ కోసం తహసీల్దార్, కొనేటాయన, అమ్మేటాయనకు సంబంధించిన బయోమెట్రిక్‌ వేలిముద్రలతోనే పోర్టల్‌ తెరుచుకుంటది.
  • అన్ని రకాలుగా క్లీన్‌ అయిన కోటీ 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు ధరణి వెబ్‌సైట్‌లో దర్శనమిస్తున్నయి.
  • కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు ఫౌతి (వారసత్వ) హక్కులు మార్చుకునే అధికారం ఆ కుటుంబానికే మేము ఇచ్చినం.

క్విక్ రివ్వూ :

ఏమిటి : రెవెన్యూ రికార్డుల్లో ఎలక్ట్రానిక్‌ ఇంటర్వెన్షన్‌ ప్రవేశపెడుతున్న తొలి రాష్ట్రం
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : తెలంగాణ
ఎక్కడ : దేశంలో
ఎందుకు :ధరణి పోర్టల్‌ ద్వారా భూ రికార్డుల సమీకృత నిర్వహణ కోసం
Published date : 30 Oct 2020 05:50PM

Photo Stories