రెగ్యులేషన్స్ రివ్యూ అథారిటీగా నియమితులైన ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్?
Sakshi Education
నియంత్రణలను క్రమబద్దీకరించడం, ఆయా నిబంధనల అమల్లో క్లిష్టతలను తగ్గించడం తదితర అంశాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తిరిగి దృష్టి సారించింది.
ఇందుకు సంబంధించి రెండవ రెగ్యులేటరీ రివ్యూ అథారిటీ (ఆర్‌ఆర్‌ఏ 2.0)ని ఏప్రిల్ 15న ఏర్పాటు చేసింది. రెగ్యులేషన్స్ రివ్యూ అథారిటీగా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎం. రాజేశ్వర్ రావు నియమితులైనట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ అథారిటీ 2021 మే 1వ తేదీ నుంచీ ఏడాదిపాటు (కాలపరిమితి పొడిగించని పక్షంలో) కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
1999లో తొలి ఆర్‌ఆర్‌ఏ ఏర్పాటు...
తొలి ఆర్‌ఆర్‌ఏను ఆర్‌బీఐ 1999 ఏప్రిల్ 1న ఏడాది కాలానికి ఏర్పాటు చేసింది. ప్రజలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వచ్చిన అభిప్రాయాల ప్రాతిపదికన అప్పటి ఆర్‌ఆర్‌ఏ రెగ్యులేషన్లు, సర్క్యులర్లు, రిపోర్టింగ్ వ్యవస్థలను సమీక్షించింది. తొలి రివ్యూ అథారిటీ సిఫారసులకు అనుగుణంగా నియంత్రణా వ్యవస్థల విధివిధానాల అమల్లో పాదర్శకత, సరళత్వం, పటిష్టత తీసుకురావడం జరిగింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రెండవ రెగ్యులేటరీ రివ్యూ అథారిటీ (ఆర్‌ఆర్‌ఏ 2.0) ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
ఎందుకు : నియంత్రణలను క్రమబద్దీకరించడం, ఆయా నిబంధనల అమల్లో క్లిష్టతలను తగ్గించడం తదితర అంశాలపై దృష్టి సారించేందుకు...

Published date : 17 Apr 2021 04:38PM